what happens when calcium levels are low

శరీరానికి తగినంత క్యాల్షియం అందకపోతే కలిగే అనర్ధాలు..

Health

శరీరానికి మంచి ఆకృతి ఉండాలంటే ఎముకలు బలంగా ఉండాలి. ఎముకలు లోపలి అవయవాల్ని కాపాడుతూ, కండరాలకు దన్నునిస్తాయి. అయితే ఈ రోజుల్లో పలువురు 40 ఏళ్లకే ఎముకలు గుల్లబారటం, మోకాళ్ల నొప్పుల వంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ తరహా ఎముకల సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి. మొదటి నుంచి ఎముక పుష్టి మీద ద్రుష్టి పెడితే వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండొచ్చని వారు సూచిస్తున్నారు. మారిన జీవనశైలి, అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ బొత్తిగా తగ్గటం వంటి అంశాలే ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

Also Read : శరీరంలో కొవ్వు చేరకుండా ఉండాలంటే ఇలా చేయండి..

Not just for bones, calcium is crucial for cardiac functioning too ...

కాబట్టి శరీర అవసరాలకు తగిన క్యాల్షియంను తీసుకుంటే ఎముకలు బలంగా మారుతాయి. అందుకే బాల్యం నుంచే తగినంత క్యాల్షియం శరీరానికి అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణుల లెక్కల ప్రకారం ప్రతి మనిషికీ రోజుకి 1 గ్రాము కాల్షియం అవసరం. ఇంత మోతాదులో అందని పక్షంలో శరీర అవసరాలకు కావలసిన కాల్షియాన్ని ఎముకల మజ్జ నుంచి నుంచి శరీరం తీసుకోవటం మొదలుపెడుతుంది. దీనివల్ల ఎముకల్లోని కాల్షియం తగ్గుతూ పోయి కొన్నాళ్ళకు ఎముకలు గుల్లబారి చిన్నపాటి ఒత్తిడికే విరుగుతాయి. వయసుపెరిగే కొద్దీ ఈ ముప్పు మరింత పెరిగి వృద్ధాప్యం రాకముందే ఆస్టియోపొరోసిస్‌,వెన్ను, తుంటి సమస్యలతో మంచాన పడాల్సి వస్తుంది.

Also Read : మన దేశంలో కూడా గబ్బిలాలను తింటారట… ఎక్కడో తెలుసా ?

Calcium Deficiency Causes

క్యాల్షియం తగినంత అందాలంటే రోజూ 1 గ్లాసు పాలు తాగాలి. అధిక బరువున్న వారు వెన్నతీసిన పాలు తాగాలి. పాలు పడనివారు పెరుగు, జున్ను వంటివి వాడొచ్చు. తరచూ చేప తినటం మంచిది. నేరుగా తీసుకోలేకపోతే కాడ్‌ లివర్‌ ఆయిల్‌ వాడినా మంచిదే. ఆహారంలో రాగులు, మొక్కజొన్న, నువ్వులతో బాటు చిరుతిండిగా తరచూ పప్పులు, బాదం, పిస్తా తినాలి. సీతాఫలం, సపోటా వంటి పండ్లలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది గనుక తరచూ వీటిని తినాలి. రోజువారీ వ్యాయామంతో ఎముకలు బలపడతాయి. కనుక వయసుతో నిమిత్తం లేకుండా అందరూ రోజుకు గంటపాటైనా తగిన వ్యాయామం చేయాలి. మరీ ముఖ్యంగా స్త్రీలు ఈ నియమాన్ని పాటించాలి.

Also Read : రుచికరమైన కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్..