veg pulao recipe in telugu

వెజ్ పులావ్ ను ఒకసారి ఇలా ట్రై చేయండి..

Recipes

కావలసిన పదార్థాలు :

బియ్యం – 1 కప్పు
బిర్యాని ఆకు – 2
ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు
పచ్చి బఠాణీ – 1 కప్పు
బీన్స్ ముక్కలు – 1 కప్పు
క్యారెట్ ముక్కలు – 1 కప్పు
కాలీఫ్లవర్ ముక్కలు – 1 కప్పు
బంగాళాదుంప ముక్కలు – 1 కప్పు
మిరియాలు – కొద్దిగా
నెయ్యి – 2 స్పూన్లు
పచ్చిమిర్చి – 4
దాల్చినచెక్క – చిన్న ముక్క
లవంగాలు – 2
యాలకలు – 2
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్స్

Also Read : తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూడండి

Vegetable Pulao Recipe | How To Make Veg Pulav

తయారుచేయు విధానం :

ముందుగా ఒక పాన్ తీసుకుని నూనె, నెయ్యి వేసుకొని వేడి చేసి అందులో జీలకర్ర, మిరియాలు, లవంగాలు, బిర్యాని ఆకు, యాలకలు, దాల్చిన చెక్క వేసుకొని ఒక నిముషం వేయించు కొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్ ముక్కలు, పచ్చి బఠాణీ, క్యారెట్, బీన్స్, బంగాళాదుంప ముక్కలు వేసి 3 నుంచి 4 నిముషాలు మగ్గించుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ ని వేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత అందులో రెండున్నర కప్పుల నీళ్లను పోసుకొని ఉడికించుకోవాలి . నీళ్లు మరిగిన వెంటనే ఉప్పును వేసుకొని 10 నిముషాలు చిన్న మంట మీద వండుకోవాలి. తరువాత ఆవిరికి చల్లబడనివ్వాలి. అంతే ఎంతో రుచకరమైన వెజ్ పులావ్ రెడీ అయినట్లే.. ఈ రైస్ ను రైతా లేదా షార్వా లతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది..

Also Read :కిస్‌మిస్ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..