Vastu Tips: Do not borrow these things from anyone

ఇతరుల పెన్ను వాడుకోని ఇవ్వడం మర్చిపోతున్నారా.. అయితే ఇది చదవండి..

Lifestyle

శక్తిలో సానుకూల శక్తి, ప్రతికూల శక్తి అని రెండు రకాలుగా ఉంటుంది. వాస్తుశాస్త్రంలో ఈ ఎనర్జీ గురించి సవివరంగా ఉంది. దీని ప్రకారం మనుషుల జీవితంపై ఈ శక్తి తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇతరుల నుంచి ఏదైనా వస్తువు తీసుకోవడం లేదా ఇచ్చే ముందు ఒకసారి తప్పకుండ ఆలోచించుకోవాలి. మీరు ఒకరి నుంచి రుణం తీసుకోవాలంటే ముఖ్యంగా కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.

వాస్తుశాస్త్రం ప్రకారం ఇతరుల పడకగదిని పొరపాటున కూడ ఉపయోగించకూడదట. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో దుష్ప్రభావం కలుగుతుంది. అదే విధంగా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇతరుల నుంచి తీసుకున్న రుణం కూడా తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారి క్షేత్రస్థాయికి చేరుకుంటుంది. మీ కుటుంబం గురించి ప్రతిచోటా చర్చ జరుగుతుంది.

healthchitkalu

 

Also Read : కొబ్బరి నూనె, కర్పూరం కలిపి ఇలా వాడితే..

మనం చాలా సందర్భాల్లో ఇతరుల నుంచి పెన్ను వాడుకోని ఇవ్వడం మర్చిపోతుంటాం. అయితే ఈ విధంగా చేయకూడదు. వాడుకున్న తర్వాత పెన్నును తిరిగి వారికి ఇవ్వకపోతే ఇది మీ జీవితంలో ఎన్నో సమస్యలను తీసుకొచ్చే అవకాశముంది. అలాగే పెట్టుబడి సంబంధిత విషయాల్లో ఆర్థిక నష్టం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైన ఇతరుల నుంచి పెన్ను తీసుకోవలసి వస్తే, పని పూర్తయిన వెంటనే దాన్ని తిరిగి ఇవ్వండి.

healthchitkalu

వాస్తుశాస్త్రం ప్రకారం ఇతరుల దుస్తులను ఎప్పుడూ ధరించకూడదు, ఇతరులకు ఇవ్వకూడదు. ఇతరుల దుస్తులను ధరించడం ద్వారా వారి ప్రతికూల శక్తి మనలోకి రావడం ప్రారంభమవుతుంది. అందువల్ల ఒకరు బట్టలను ఇంకొకరు వేసుకోకూడదు. అంతేకాకుండా మీరు ముఖ్యమైన పనికోసం బయటకు వెళ్తున్న సమయంలో ఇతరుల దుస్తులను పొరపాటున కూడా ధరించకూడదు. ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా వెళ్లిన పని కూడా చెడిపోతుంది. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది.

healthchitkalu

Also Read : కేరళ వెళ్ళినప్పుడు తప్పక టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్ ఇవే..