tomato juice for dark circles

టమోటాతో డార్క్ సర్కిల్స్ దూరం..

Beauty

అమ్మాయిలు అందంగా ఉండడం కోసం రకరకాల చిట్కాలు వాడుతారు. కానీ కొన్ని సార్లు అవేవి కూడా అంత బాగా పని చెయ్యవు. ముఖ్యంగా కళ్ల చుట్టూ ఉండే బ్లాక్ సర్కిల్స్ మీ అందాన్ని నాశనం చేస్తుంది. సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ తొలగించవచ్చు. కొన్ని ఇంటి చిట్కాలు మీ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. డార్క్ సర్కిల్‌కు వ్యతిరేకంగా పోరాటంలో టమోటా ఒకటి. టొమాటోకు సహజంగా బ్లీచ్ చేసే సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

చర్మాన్ని కాంతివంతం చేయడానికి నిమ్మరసం బాగా సహాయపడుతుంది. ఇది నల్లటి వలయాల నివారణకు ఒక అద్భుతమైన హోం రెమెడీ. టమోటా రసంలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని 10 నిముషాలపాటు మర్దన చేసి తర్వాత చల్లని నీటితో కడగాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Also Read : భ్రింగరాజ్ ఆయిల్ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు తెలుసా ?

5 Home Remedies: How To Get Rid Of Dark Circles Under Eyes With Kitchen  Ingredients

కలబంద యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు చర్మాన్ని రక్షిస్తుంది. కాబట్టి కంటి చుట్టూ ఎలాంటి నొప్పి, నల్లని వలయాలనున్నా ఇవి ప్రభావవంతంగా తొలగిస్తాయి. కలబంద గుజ్జులో టమోటా రసం కలిపి ఈ పేస్ట్ ను మీ కళ్ళ చుట్టూ రాసుకుని 15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి 1 నుండి 2 సార్లు చేయండి.

బంగాళాదుంపలోని ఎంజైమ్ నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. టమోటా బ్లీచింగ్ లక్షణాలతో కలిపినప్పుడు ఇది నల్ల వలయాలను తొలగించడానికి సహాయపడుతుంది. టొమాటో గుజ్జులో బంగాళాదుంప పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ రాసుకుని డ్రై అయ్యే వరకు ఉంచి తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా 2 రోజులకు ఒకసారి చేస్తే మీరు మంచి ఫలితాలను పొందవచ్చు.

Also Read : .జుట్టు పెరుగుదలకు వెల్లుల్లి.