tips for giving birth in a lockdown

మీ డెలివరీ లాక్‌డౌన్ టైమ్‌లో అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

Pregnancy

కరోనా వైరస్ కారణం గా మన జీవితాల్లో చాలా మార్పులు జరిగాయి. ఈ సమయంలో ప్రెగ్నెన్సీ మహిళలకు ఇంకా కష్టంగా మారింది. అనుకున్నవేవీ అనుకున్నట్టు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి లాక్ డౌన్ లో డెలివెరి అయ్యే వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పట్నించీ పసిపిల్లలకి కూడా ఈ వైరస్ సోకుతున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటివి జరగవు అని చెప్పడం లేదు కానీ జరిగే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు.

Also Read : గర్భిణీలు డార్క్ చాక్లెట్ తింటే కడుపులో బిడ్డ బాగా పెరుగుతుందట..

తల్లి నుంచి బిడ్డకి సోకే అవకాశం కూడా చాలా తక్కువ. ఒకవేళ తల్లిదండ్రులలో ఎవరికైనా కరోనా సోకవచ్చేమో అన్న అనుమానం ఉంటే బిడ్డని వారినించి కొన్ని రోజులు దూరంగా ఉంచుతారు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మమూలుగానే రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అంటే మీరు మీ కోసం, మీ బిడ్డ ఆరోగ్యం కోసం కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించండి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండడం కోసం చాలా హాస్పిటల్స్ లో మిగిలిన పనులన్నీ ఆపేశారు. కాబట్టి మీ డెలివరీ కి ముందే మీ అపాయింట్మెంట్ కోసం మీ డాక్టర్ కి కాల్ చేసి కనుక్కోండి.

Also Read : వంకాయ పచ్చి పులుసు తింటే ఆహా అనాల్సిందే…

samayam telugu

అత్యవసరమైతే తప్ప అడుగు బయటపెట్టకండి. ముఖ్యమైనవన్నీ దగ్గర పెట్టుకోండి. ఒకసారి మీకు నొప్పులు మొదలైన తరువాత, లేదా బిడ్డని ఇంటికి తీసుకువచ్చిన తరువాత బిడ్డకు సంబంధించిన వస్తువులన్నీ మీకు అవసరమౌతాయి. ఒకసారి మీ బిడ్డ మీ ఇంట్లో ప్రవేశించాక శానిటైజేషన్ కి అత్యంత ప్రాధాన్యతనివ్వండి. ఈ సమయంలో బిడ్డ పుట్టాలని నిజంగా ఎవ్వరూ కోరుకోరు. మీ గురించీ, బిడ్డ ఆరోగ్యం గురించీ ఆందోళన చెందడం సహజం. కానీ, భయపడకుండా, వైద్యనిపుణుల సలహాలు తీసుకుంటూ ఉండండి. కొంతమందికి ఇదే తొలి సంతానం కావచ్చు. కానీ ఇలాంటి పరిస్థితిలో ధైర్యంగా ఉండండి.

Also Read : ఆహారం విషయంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు..