Threat to Corona winners

కరోనా విజేతలకు పొంచి ఉన్న ముప్పు..

Lifestyle

కరోనా వైరస్ మన దేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. కొన్ని లక్షల మంది దీని బారిన పడగా, కొన్ని వేల మంది చనిపోయారు. అయితే శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం.. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారికి కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయని వెల్లడించారు. ఇప్పుడు ఈ న్యూస్ విని కోవిడ్ విజేతలుగా నిలిచినవారు భయంతో వణికిపోతున్నారు.

దీంతో మళ్లీ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ఫలితంగా కోవిడ్ విజేతల్లో సంతోషం మిగలడం లేదు. ఇది కోలుకున్న అందరి సమస్య కాకపోయినా కొందరికి మాత్రం తీవ్ర సమస్యగా మారింది. ముఖ్యంగా కరోనా వైరస్‌ ఊపిరితిత్తులను కేంద్రంగా చేసుకొని దాడి చేస్తుంది. కాబట్టి చికిత్స అనంతరం శ్వాస కోశాలు మునపటిలా వికసించడం లేదు.

కరోనా వైరస్‌ అధికంగా ఉండి బయట పడిన వారి శ్వాసకోశాల్లో ఫైబ్రోసిస్‌ సమస్య ఏర్పడడం వల్ల శ్వాస తీసుకున్నపుడల్లా బెలూన్‌లా ఉబ్బాల్సిన ఊపిరితిత్తులు గట్టిపడిపోయి మొత్తం సామర్థ్యం మేరకు పని చేయలేకపోతున్నాయనీ, ఇంకా ఇతర సమస్యలు కూడా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొన్ని రకాల స్టెరాయిడ్స్‌ స్‌ వేసుకోకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి.

Also Read : వంట దినుసులతో ఆరోగ్యం పదిలం..

CORONAVIRUS LIVE UPDATES CORONAVIRUS UPDATES CORONAVIRUS SYMPTOMS DELHI  CORONAVIRUS HYDERABAD BANGALORE TREATMENT ...

అలాగే కరోనా వచ్చి తగ్గిన తర్వాత కొందరిలో ఊపిరితిత్తుల్లో మచ్చలు ఏర్పడతాయి. సాధారణంగా ఇన్‌ఫెక్షన్‌ తగ్గితే మచ్చలు మానిపోవాలి. కొందరిలో వైరస్‌ తీవ్రత కారణంగా పల్మనరీ ఫ్రైబోసిస్‌ దీర్ఘకాలంగా ఉంటాయి. ఈ మచ్చలు మానకపోతే పుండుగా మారే ప్రమాదముంది. ఊపిరిత్తులు సాగే గుణం కోల్పోయి, కుంచించుకు పోతాయి. మచ్చలు నయంకాకపోతే కరోనా తగ్గిన 4 నెలల తర్వాత ఆయాసం వంటి ఇబ్బందులు ఏర్పడతాయి.

కరోనా నుంచి కోలుకున్న కొందరిలో రక్తం చిక్కబడి రక్త సరఫరాలో బ్లడ్‌ క్లాట్స్‌ ఏర్పడతాయి. కాళ్లలో గడ్డలుగా ఏర్పడటం, రక్త సరఫరా నిలిచిపోవడం, బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండె స్పందనలు ఆగిపోవడం చోటుచేసుకునే ముప్పు ఉంటుంది. కరోనా వైద్యంలో వినియోగించిన కొన్ని రకాల మందుల వల్ల ఫంగస్‌, క్షయ ముప్పు ఉంటుంది. కరోనా తగ్గిన 3-4 నెలల తర్వాత ఈ సమస్యలు మొదలవుతాయి.

Also Read : వ్యాధినిరోధక శక్తి బలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..