take these vitamin d foods to reduce corona risk

విట‌మిన్ డి లోపిస్తే కరోనా తొందరగా ఎటాక్ చేస్తుందని మీకు తెలుసా..!

Health

మన శరీరానికి విట‌మిన్ డి చాలా అవసరం. విట‌మిన్ డి లోపిస్తే చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విట‌మిన్ డి శ‌రీరంలోని ఎముక‌లను, కండ‌రాల‌ను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. అంతేకాదు విట‌మిన్ డి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతుంది. కాబట్టి ఈ కరోనా బారి నుండి తప్పించుకోవాలంటే విట‌మిన్ డి చాలా అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ విటమిన్ డి త‌గినంత అందేలా చూసుకోవాలి. సూర్య‌ర‌శ్మిలో త‌గినంత స‌మ‌యం పాటు ఉంటే విట‌మిన్ డి అందుతుంద‌ని మ‌న‌కు తెలుసు. అలాగే ప‌లు ర‌కాల ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల కూడా విట‌మిన్ డిని పెంచుకోవ‌చ్చు.

Also Read : ర‌క్త‌హీన‌తను నిర్ల‌క్ష్యం చేస్తే సమస్యలు తప్పవు..

చేపలు :

చేప‌ల్లో విటమిన్ డి ఎక్కువ‌గా ఉంటుంది. ముఖ్యంగా సాల్మ‌న్‌, ట్యూనా అని పిల‌వ‌బ‌డే చేప‌ల్లో ఇది మ‌రీ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. 100 గ్రాముల చేప‌ల‌ను తింటే నిత్యం మ‌న‌కు కావ‌ల్సిన విట‌మిన్ డిలో 66 శాతం లభిస్తుంది. కాబట్టి త‌ర‌చూ చేప‌ల‌ను తింటే మంచిది.

కోడిగుడ్లు :

Tis the Season to Dial Up the D - Vital Choice Wild Seafood & Organics

కోడిగుడ్ల‌లో విట‌మిన్ డి ఎక్కువ‌గా ఉంటుంది. ముఖ్యంగా అందులోని ప‌చ్చ‌సొన‌లో విటమిన్ డి ఉంటుంది. క‌నుక నిత్యం కోడిగుడ్ల‌ను తినాలి. వీటి వ‌ల్ల ఇత‌ర విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ల‌భిస్తాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంచుతాయి. క‌నుక గుడ్ల‌ను నిత్యం క‌చ్చితంగా తీసుకోవాలి. దీంతో విట‌మిన్ డి ల‌భిస్తుంది. శ‌రీర రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

పుట్ట‌గొడుగులు :

పుట్ట‌గొడుగుల్లోనూ విట‌మిన్ డి ఎక్కువ‌గానే ఉంటుంది. అలాగే సోయా మిల్క్‌, ఆవు పాలు, ఆరెంజ్ జ్యూస్‌, తృణ ధాన్యాలు, ఓట్ మీల్ వంటి త‌దిత‌ర ఆహారాల‌ను నిత్యం తీసుకున్నా విట‌మిన్ డి మ‌న‌కు ల‌భిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

Also Read : కరివేపాకు అద్భుత ప్రయోజనాలు తెలిస్తే..