summer special smoothies

సమ్మర్ స్పెషల్ స్మూతీస్‌ మీకోసం..

Health

వేసవికాలం వచ్చేసింది.. ఎండకు తట్టుకోలేక రకరకాల కూల్ డ్రింక్స్ తాగుతుంటాం.. వేడి, వేడి కాఫీ, టీ ల బదులు చల్ల చల్లగా ఏమైనా తాగాలనిపిస్తోంది. వేసవిలో మాత్రమే దొరికే మామిడి పండ్లతో, నిమ్మ, కీరలతోనూ చేసిన చల్లటి పానీయం తాగితే దాహం తీరటమే కాదు. వేసవి అలసట మొత్తం మాయమైపోతుంది. వేసవికాలం వచ్చిందంటే షేక్స్, ఇంకా స్మూతీస్ వచ్చేస్తాయి. మీకిష్టమైన పండ్లు, కూరల్ని, పాలతోగానీ, పెరుగుతోగానీ కలిపి చేసేదే స్మూతీ. రుచిగా ఉండటమే కాకుండా కడుపు నిండినట్టుగా కూడా ఉంటుంది. స్మూతీలతో మరో లాభం ఏంటంటే వీటి వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ఇందులో అన్నీ తాజా పండ్లు, కూరగాయలు ఉండడం వల్ల శరీరానికి అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ లభిస్తాయి.

Also Read : వంకాయ పచ్చి పులుసు తింటే ఆహా అనాల్సిందే…

మామిడి పండ్ల స్మూతి :

mango smuti - Vaša kuharica

మామిడిపళ్ళు లేని వేసవికాలాన్ని ఊహించలేం కదా. మామిడి పళ్ళ రసం, పెరుగు, పాలు కలిపి ఈ స్మూతీ చేసుకోండి. చల్ల చల్లగా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు.

స్ట్రాబెర్రీ స్మూతి :

Strawberry Watermelon Smoothie - Super Healthy Kids

వేసవి ఎండలను తట్టుకోడానికి మనకి ప్రకృతి ప్రసాదించిన వరాల్లో స్ట్రాబెరీస్ కూడా ఉంటాయి. కొద్దిగా పుల్లగా ఉండి, నోరూరించే స్ట్రాబెర్రీస్‌‌ని పాలతోనో, పెరుగుతోనో కలిపి చిక్కటి స్మూతీగా చేసుకొండి. చల్లగా ఆస్వాదించండి.

Also Read : మీ డెలివరీ లాక్‌డౌన్ టైమ్‌లో అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

కర్బూజా, కివీ స్మూతి :

Melon Banana Smoothie - More Juice Press

వేసవితో పాటూ కర్బూజాలు కూడా వచ్చేస్తాయి. తియ్యగా నోరూరించే కర్బూజాలు విడిగా తిన్నా కూడా చాలా బావుంటాయి. కానీ వీటిని కివీలతో కలిపి స్మూతీ చేస్తే ఆ రుచే వేరు. దీనిని చల్ల చల్లగా తాగితే ఆ మజానే వేరు.

పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూతి :

ఉత్సాహాన్ని, శ‌క్తిని ఇచ్చే.. చ‌ల్ల ...

గులాబీరంగులో అందంగా కనిపించే ఈ స్మూతీ ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ కూడా ఇస్తుంది. ఈ స్మూతీ తయారు చేసినప్పుడు ఎక్కువే చేసి పెట్టుకోండి. పిల్లలూ, పెద్దలూ కూడా ఇంకా కావాలి అని అడిగి మరీ తాగుతారు. మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. వీటి వల్ల వాటి రుచిని ఎంజాయ్ చేయడమే కాకుండా వాటి హెల్దీ బెనిఫిట్స్‌ని కూడా పొందొచ్చు.

Also Read : ఆహారం విషయంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు..