side effects of eating slate pencil and chalk pieces during pregnancy

ప్రెగ్నెంట్స్ చాక్ పీస్, బలపాలు తినడం వల్ల కలిగే అనర్ధాలు..

Pregnancy

కొంతమందికి చాక్ పీస్, బలపాలు తినే అలవాటు ఉంటుంది. దీనికి గనుక సరిగ్గా ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే భవిష్యత్‌లో అది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌కి దారి తీయొచ్చు. ఈ సమస్యను పీకా అంటారు. ఈ సమస్య ఉన్నవారు బలపాలు, చాక్‌పీస్‌లు తింటారు. వీరికి మట్టీ, చాక్ పీసులు, ఐస్ వంటి వాటిని చూడగానే నోరూరిపోతుంటుంది. ఇది ఒక ఈటింగ్ డిసార్డర్ గా చెప్పొచ్చు. ఓసీడీ ఉన్నవారూ, పోషకాహారలేమితో బాధపడుతున్నవారూ, ప్రెగ్నెంట్ గా ఉన్న వారూ కూడా ఇలా తింటారు. ఒక్కోసారి బాడీ లో అవసరమైనంత జింక్ లేకపోయినా కూడా ఈ పీకా సమస్య వస్తుంది.

Also Read : గ్రహణం సమయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Ceat Brand, Slate Pencil, Chalk Made from Natural, India Saleti ...

చాక్‌పీస్‌లు, బలపాల పెద్ద విష పదార్ధం కాదు. కానీ దాన్ని తినటం మంచిది కాదు. దాని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. జీర్ణ సమస్యలు, మలబద్ధకం, కడుపులో నులిపురుగు పెరగడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ప్రెగ్నెంట్స్ గానీ, ఫీడింగ్ మదర్స్ కానీ వీటిని తింటే దాని వల్ల వచ్చే నష్టాలు వేరేలా ఉంటాయి. వారికి సరిగా ఆకలి కాక, అన్ని రకాలా ఆహార పదార్ధాలూ తీసుకోక, పోషకాహార లేమి వస్తుంది. ఇది వారికి మాత్రమే కాదు.. పుట్టబోయే పిల్లలకి కూడా మంచిది కాదని చెబుతున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

Also Read : రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటున్నారా ?