ramappa temple history in telugu

ఈ ఆలయంలో ఉండే నంది మనం ఎటు చూస్తే అటు తిరుగుతుందట..

Travel

కాకతీయుల శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలిచే ఆలయాలలో వరంగల్ జిల్లాలో కొలువైన 800 ఏళ్ల నాటి రామప్ప ఆలయం ఒకటి. రామప్ప ఆలయంలో అడుగడుగునా అద్భుతాలే. రామప్ప అంటే ఈ ఆలయంలో దైవం పేరు కాదు. ఈ ఆలయాన్ని అద్భుత కళాఖండంగా మలచిన ప్రధాన శిల్పి పేరు. ఈ ఆలయంలోని వింతలు విశేషాలు పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ శివాలయాన్ని క్రీస్తు శకం 1213లో రేచర్ల రుద్రుడు కట్టించారని ఇక్కడ దొరికిన రాతిశాసనాల్లో ఉంది. ఈ ఆలయం నిర్మాణం పూర్తికావడానికి 40 ఏళ్లు పట్టిందట. ఈ ఆలయ గోపురం నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు నీళ్లలో వేస్తే తేలుతాయట.

Also Read : రాయలసీమలోని అత్యంత ఎత్తైన వేసవి విడిది కేంద్రం హార్సిలీ హిల్స్..

అంతేకాదు సాధారణంగా ఆలయాల్లోని గర్భాలయాల్లో వెలుతురు తక్కువగా ఉంటుంది. కానీ రామప్ప ఆలయంలోని గర్భాలయంలో రాత్రివేళలో తప్పా రోజంతా వెలుతురు ఉంటుంది. ఇందుకు ఆలయంలో నిర్మించిన స్తంభాలే కారణం. బయట ఉండే కాంతి నునుపైన స్తంభాలపై పరివర్తనం చెంది గర్భాలయంలో పడటం వల్ల ఆ వెలుతురు వస్తుంది. ఈ ఆలయంలో శిల్పకళ విశిష్టతను తెలిపే మరో అద్భుతం సప్తస్వరాలు పలికే శిల్పం. ఆలయ ప్రధాన ద్వారానికి ఎడమవైపున ఉండే శిల్పాన్ని వేళ్లతో మీటితే సరిగమపదనిసలు పలుకుతుంది.

Also Read : తల్లి అయిన ప్రతీ మహిళా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..

Ramappa temple to get a facelift - The Hindu

మరో శిల్పంలో ముగ్గురు వ్యక్తులకు కలిపి నాలుగు కాళ్లు ఉంటాయి. అంతేకాదు ఈ ఆలయంలో ఉండే నందీశ్వరుడిని ఎటువైపు నుంచి చూసినా అది మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది. ఆలయం చుట్టూ చెక్కిన 526 ఏనుగు విగ్రహాలు కనువిందు చేస్తాయి. రామప్ప దేవాలయం వరంగల్‌కు 68 కిమీలు, హైదరాబాద్‌కు 257 కిమీల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్లేందుకు నిత్యం బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. వసతి కోసం అక్కడ పర్యాటక శాఖవారి హరిత హోటల్స్ అందుబాటులో ఉంటాయి.

Also Read : వర్షాకాలంలో ఖచ్చితంగా తినాల్సిన పండ్లు..