oats pakoda recipe in telugu

యమ్మీ యమ్మీ ఓట్స్‌ పకోడీ మీకోసం..

Recipes

ఓట్స్‌లో ఉండే పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఓట్స్‌ ఒక గొప్ప ఆహారం. ఇన్ని పోషక విలువలున్న ఓట్స్‌ని ఆహారంలో బాగం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఓట్స్‌తో టేస్టీగా పకోడీ చేసుకుందాం. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read : విట‌మిన్ డి లోపిస్తే కరోనా తొందరగా ఎటాక్ చేస్తుందని మీకు తెలుసా..!

కావలసిన పదార్ధాలు :

ఓట్స్ – ఒక కప్పు
బియ్యం పిండి – 1 టేబుల్‌ స్పూన్
శనగపిండి – 1 1/2 టీస్పూన్స్
పచ్చిమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – చిన్నకట్ట
ఉల్లిపాయ – 1
పెరుగు – 2 టేబుల్‌ స్పూన్స్
నూనె – తగినంత
ఉప్పు – తగినంత

Also Read : నోరూరించే ఆలూ శాండ్విచ్‌..

తయారుచేయు విధానం :

ఒక గిన్నెలో ఓట్స్, బియ్యం పిండి, శనగపిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేయాలి. కొద్దిగా నూనెని వేడి చేసి ఇందులో పోయాలి. దీంట్లోనే పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేసి బాగా వేడి చేయాలి. ఈ నూనె కాగిన తర్వాత ఓట్స్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి బాగా వేయించాలి. వేడి వేడిగా లాగిస్తే ఇవి మరింత టేస్టీగా ఉంటాయి.

Also Read : కరివేపాకు అద్భుత ప్రయోజనాలు తెలిస్తే..