best hair oils for hair growth

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ఈ నూనెలు వాడితే సరి..

Beauty

అందంలో జుట్టు కూడా కీలక పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలుసు. జుట్టు ఆరోగ్యంగా ఉంటేనే చూడడానికి అందంగా ఉంటారు. జుట్టుకు నూనె రాయటం వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు సమకూరి ఆరోగ్యంగా ఉండటమే గాక అందంగా, సహజంగా ఉంటుంది. కుదుళ్లు కూడా గట్టిపడతాయి. అంతేకాదు జుట్టు కూడా పొడిబారదు. తద్వారా జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది. చాలామంది జుట్టుకు కేవలం కొబ్బరినూనె మాత్రమే వాడతారు కానీ జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే పలురకాల నూనెలూ వాడాలి. ఇప్పుడు అవేమిటో తెలుసుకుందాం..

ఆముదంతో జుట్టుకు మర్దన చేయటం వల్ల జుట్టు రాలటం ఆగి, నల్లని, ఒత్తైన జుట్టు సొంతమవుతుంది. ఆముదానికి ఆవనూనె కలిపి రాసుకొంటే చిట్లిన జుట్టు ఆరోగ్యకరంగా మారుతుంది.

కుదుళ్ళ నుంచి చివర వరకూ జుట్టు దృఢంగా ఉండాలంటే ఉసిరినూనె వాడడం మంచిది. ఇందులోని విటమిన్‌ సి నేరుగా జుట్టుకు అందుతుంది. రాత్రి పడుకునే ముందు ఉసిరి నూనెను తలకు రాసుకుని మర్దన చేసుకుంటే అలసట తొలగిపోతుంది. చుండ్రు, జుట్టురాలడం, తలనొప్పి వంటి ఇబ్బందులూ కూడా దరిజేరవు.

Also Read : అవాంఛిత రోమాలను తొలగించడానికి హోమ్ రెమెడీస్

కొందరికి జుట్టు చిక్కగా, పొడవుగా ఉన్నాపొడి బారి, కళా విహీనంగా కనబడుతుంది. ఇలాంటివారు రోజ్‌మేరీ ఆయిల్‌ వాడితే మంచిగుణం ఉంటుంది. పోషకాల లోపంతో జుట్టు ఎదుగుదల తక్కువగా ఉన్నవారికీ ఇది చక్కని ఫలితాన్నిస్తుంది.

జుట్టు పలుచగా ఉన్నవారు వారానికి 2 సార్లు ఆల్మండ్‌ ఆయిల్‌ వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ముఖ్యంగా ఎండ, చలి వంటి వాతావరణ మార్పులను జుట్టు మీద పడకుండా చేస్తుంది. సముద్రస్నానం చేసేవారు ముందుగా ఈ నూనె రాస్తే జుట్టుమీద ఉప్పునీటి ప్రభావం పడకుండా చేస్తుంది.

natural oils for hair growth

యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే ఆలివ్‌ ఆయిల్‌ చేసేంత మేలు జుట్టుకు మరే నూనె చేయదు. ఇది జుట్టు రాలకుండా, చుండ్రు చేరకుండా చూస్తుంది. అయితే ఆలివ్ ఆయిల్ వాడదలచుకుంటే ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆయిల్‌ వాడాలి.

Also Read : జుట్టు రాలడాన్ని తగ్గించే అద్భుత చిట్కాలు