mobile phone use is harmful for children

పిల్లలకు మొబైల్ ఫోన్ వినియోగం వల్ల ఎన్ని నష్టాలో తెలుసా ?

Kids-Health

ఈ రోజుల్లో కనీసం 2 సంవత్సరాలు వయసు నిండని వారికి కూడా సెల్ ఫోన్లు ఇచ్చి వారిని ఫోన్ వ్యసనపరులుగా తల్లిదండ్రులు మారుస్తున్నారు. ఇలా వ్యసనపరులుగా మారడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో పిల్లలు ముఖ్యంగా యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బానిసలుగా మారి అర్థ రాత్రివరకూ మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు.

Also Read : కేక పెట్టిస్తోన్న యాంకర్ మంజూష లేటెస్ట్ ఫోటోస్

పిల్లలు మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, చిరాకు, అసహనం అధికం కావడం, శారీరక శ్రమకు దూరం కావడంతో పలు రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారని వివరించారు. పిల్లలు, యువకులు రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోయే విధంగా పేరెంట్స్ తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read : నోరూరించే మిర్చి బజ్జి..

When Should I Get My Kid a Phone - Asurion

మొబైల్ ఫోన్లు అధికంగా ఉపయోగిస్తే కలిగే అనర్థాలను పిల్లలకు అర్థమయ్యేట్టు తెలపాలని వారు చెబుతున్నారు. ఎవరైనా రోజుకు నాలుగు గంటలకన్నా అధికంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తే అది వ్యసనం కిందకి వస్తుందని తెలిపారు. సోషల్ మీడియాపై నియంత్రణ ఉండాలి కానీ అవే మనను నియంత్రించే స్థాయికి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కనీసం ఎనిదేళ్లు వయస్సు దాటిన పిల్లలకే మొబైల్ ఫోన్లను వినియోగించేందుకు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : క్యారెట్ జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం రండి..