mirchi bajji recipe in telugu

నోరూరించే మిర్చి బజ్జి..

Recipes

సాయంత్రం సమయంలో బజ్జి మంచి స్నాక్ ఐటెమ్ అని చెప్పొచ్చు. కానీ బయట దొరికే ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి ఇంట్లోనే అందుబాటులో ఉన్న పదార్థాలతోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

Also Read : ఎంతో రుచిగా ఉండే కడై పనీర్..

కావలసిన పదార్ధాలు :

శనగ పిండి – 2 కప్పులు
బజ్జి మిర్చి – 1/4 కిలో
బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్
ఆయిల్ – సరిపడ
వాము – 1 టేబుల్ స్పూన్
కారం – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
పసుపు – చిటికెడు
సోడా ఉప్పు – చిటికెడు

Also Read : తలనొప్పి తగ్గాలంటే ధనియాలతో ఇలా చేస్తే సరి…

Aloo Bhari Mirchi Ke Pakore Recipe | Aloo Mirch Pakora

తయారుచేయు విధానం :

ముందుగా ఒక బౌల్ తీసుకుని శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు ఇలా ఒకదాని తర్వాత ఒకటి కలిపి ఇప్పుడు ఈ మిశ్రమంలో ఓ స్పూన్ ఆయిల్ వేసి మరోసారి కలపండి. ఇందులో తగినంత నీరు పోసి బజ్జీల పిండిలా కలపండి. ఇప్పుడు పచ్చి మిర్చిలను మధ్యలో చీల్చి అందులో వాము, శనగపిండి మిశ్రమం పెట్టాలి. తర్వాత పాన్ తీసుకుని నూనె వేసి వేడి అయిన తర్వాత మిర్చిలను పిండిలో ముంచి నూనెలో వేసి దోరగా వేయించండి. అంతే ఎంతో రుచిగా ఉండే మిర్చి బజ్జి రెడీ అయినట్లే. వీటిని వేడివేడిగా టమాటా సాస్‌తో కానీ, ఉల్లిపాయ కాంబినేషన్‌తో కానీ తింటే చాలా బావుంటాయి.

Also Read : కుంకుమపువ్వుతో అందమైన చర్మం మీసొంతం..