lunar eclipse effects on pregnant ladies

గ్రహణం సమయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Pregnancy

గ్రహణం సమయంలో గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని పెద్దలు చెబుతారు. గర్భంతో ఉన్నప్పుడు నియమాలు పాటించకపోతే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతారు. ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. చంద్రుడి కాంతి భూమి మీద పడకుండా ఒక ఛాయ ఉండడాన్ని చంద్రగ్రహణం అంటాం. గర్భిణీలు ఈ సమయంలో కదలకుండా పడుకోకపోతే గర్భంలోని పిండంపై ప్రభావం పడి పిల్లలకు గ్రహణ మొర్రి, ఇతర లోపాలతో పుడతారని చెబుతారు. దీనికి శాస్త్రీయపరంగా రుజువులు లేవని కొంతమంది కొట్టి పారేస్తారు.. అయితే ఇది మూఢనమ్మకమా, శాస్త్రీయ కోణమా అనేది పక్కనబెడితే గర్బిణిలు కొన్ని సూచనలు పాటించాలి.

Also Read : మీ డెలివరీ లాక్‌డౌన్ టైమ్‌లో అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

June 5 Chandra Grahan 2020 sutak samay| Chandra Grahan 2020: What ...

గ్రహణానికి ముందే గర్భిణీలు అన్ని పనులు పూర్తి చేసుకుని, ఆహారం తీసుకుని పడుకోవాలని.. ఆ సమయంలో కదలకుండా ముఖ్యంగా 3 నెలలోపు వారు కదలకుండా అలానే పడుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. అంతేకాదు ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నారు. గ్రహణం తర్వాత మళ్లీ శుభ్రంగా స్నానాలు చేసి శివాలయాలకు వెళ్లి దీపారాధన చేయాలని చెబుతున్నారు. గ్రహణ సమయంలో గర్భిణీలు కచ్చితంగా ఎలాంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. ప్రయాణాలు చేయొద్దు.. వీటితో పాటు.. ఇక అందరూ ఓం నమ నారాయణాయ అనే దైవనామస్మరణ, ఓం నమో భగవతే వాసుదేవాయా అనే మంత్రాలను జపించాలి.

Also Read : గంధంతో ఎన్ని ఉపయోగాలో తెలుసా ?