foods to fight anemia at home

ఎదిగే వయసు పిల్లలకు పోషకాహారం లభించకపోతే..

Kids-Health

ఎదిగేవయసు పిల్లలకు పోషకాహారం లభించకపోతే ఆ ప్రభావం వారికీ జీవితాంతం ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తూ ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండడానికి, రోగాలతో పోరాడడానికి అవసరమయ్యే శక్తిని అందించేదే నిజమైన పోషకాహారం. చిన్న వయస్సులో పిల్లలకు నేర్పించే ఆహారపు అలవాట్లు భవిష్యత్తులో వారి జీవనశైలిని సరైన మార్గంలో నడిపిస్తాయి. యసు గల పిల్లలతో పోలిస్తే తగినంత బరువు, ఎత్తు లేని పిల్లలు ఈ సమస్య బాధితులేనని చెప్పవచ్చు. సమస్యను ముందే గుర్తించి తగు చర్యలు తీసుకోకపోతే పిల్లలు తీవ్ర పోషకాహార లోపం బారిన పడే అవకాశం లేకపోలేదు.

Also Read : ఆరోగ్యానికి ద్రాక్ష చేసే మేలు..

పిల్లల పెరుగుదలకు క్యాల్షియం చాలా అవసరం. అందుకే రోజులో మూడు సార్లు పిల్లలకు పాలు తగిన మోతాదులో ఇస్తుండాలి. పాలతో పాటు క్యాల్షియం పొందేందుకు.. వేయించిన నువ్వులు, మొలకెత్తిన సోయా గింజలు, డ్రై ఫ్రూట్  ఇస్తే పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలకు కేలరీలు, ప్రొటీన్లతో కూడిన భోజనం ఉండాలి. లంచ్‌లో ఆకుకూరలను ఎక్కువగా చేర్చడం చాలా మంచిది. ఎందుకంటే లంచ్‌లో 1/3 ఆకుకూరలు ఉండడం వల్ల అనేక విటమిన్లు, ఐరన్ పొందవచ్చు.

Eat These Foods Together for the Most Health Benefits

Also Read : క్యారెట్ జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం రండి..

రోజువారీ ఆహారంలో కూరగాయలు, పప్పు ధాన్యాలు, గుడ్డు, పండ్లు ఉండేలా చూడాలి. వీటికితోడు అదనంగా ఓ గుడ్డును కూడా అందించాలి. పాలు, పెరుగు, పండ్లు, పన్నీర్ వంటివి ప్రొటీన్‌ను మెరుగుపరుస్తాయి. బయట కొనుగోలు చేసే చిప్స్, సోడా, జూస్ వంటివాటిని నియంత్రించి ఇంట్లోనే స్వయంగా స్నాక్స్, పండ్లరసాలు తయారుచేసి పిల్లలకు ఇవ్వాలి. ప్రతీ సీజన్ లో లభ్యమయ్యే అన్ని రకాల పండ్లు, కూరగాయలను అలవాటు చేస్తే భవిష్యత్తులో కూడా వారు వాటిని అలాగే కొనసాగిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.

Also Read : శరీరంలో మెగ్నీషియం లోపిస్తే జరిగే అనర్ధాలు..