kerala famous food

కేరళ వెళ్ళినప్పుడు తప్పక టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్ ఇవే..

Lifestyle

కేరళ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడి బీచ్ లు, బ్యాక్ వాటర్స్, హిల్ స్టేషన్లు మాత్రమే కాదు రుచికరమైన ఆహారం కూడా గుర్తుకు వస్తుంది. కేరళ వెళ్లాలనుకునే ప్రయాణికులు అక్కడ దొరికే టేస్టీ ఫుడ్ గురించి తప్పక తెలుసుకోవాలి. మీ ట్రావెల్ డైరీలో తప్పక నోట్ చేసుకోవాల్సిన కొన్ని బెస్ట్ కేరళ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మలబారీ పరోటా :

Malabar Paratha Recipe / Kerala Parotta Recipe / How to Make ...

చాలా చోట్ల మీరు పరోటాలను టేస్ట్ చేసే ఉంటారు. కానీ మలబారీ పరోటాల రుచి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పొరలు పొరలుగా ఉండే ఈ పరోటాలను ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా చేస్తాయి. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. చికెన్ చెట్టినాడ్, కరిమీన్ ఫ్రై వంటి వంటకాలు ఈ పరోటాకు పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తాయి.

Also Read : తల్లి అయిన ప్రతీ మహిళా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..

​కరిమీన్ ఫ్రై :

Kerala food | Karimeen Fry: A fish fry recipe by Regi Mathew of ...

మీరు కేరళలో ఉన్నప్పుడు కరిమీన్ ఫ్రై రుచి చూడడం అస్సలు మిస్ చేయకండి. దీనిని మట్టి కుండలో కేరళలోని ప్రసిద్ధ మసాలా దినుసులను జోడించి చేస్తారు. అన్నంలో దీనిని దీన్ని వడ్డిస్తారు. అలెప్పీలోని బ్యాక్ వాటర్స్ లో నడిచే హౌస్ రెస్టారెంట్ లలో మంచి కరిమీన్ ఫ్రై దొరుకుతుందని చాలా మంది టూరిస్టులు చెబుతుంటారు.

​కొబ్బరి కూర పుట్టు :

Puttu - Wikipedia

కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ అల్పాహారాల్లో పుట్టు ఒకటి. చాలా మందికి ఇది ఇడ్లీ మాదిరిగా అనిపిస్తుంది. కానీ రుచి మాత్రం చాలా విభిన్నంగా ఉంటుంది. ఇంతటి రుచికరమైన వంటకాన్ని మీరు ఇదివరకు ఎప్పుడూ రుచి చూసి ఉండరు. ఈ పదార్ధాన్ని బియ్యం మరియు కొబ్బరి ముక్కలతో తయారు చేస్తారు. కేరళలో ఎక్కువ మంది ప్రాధాన్యత ఇచ్చే అల్పాహారాల్లో ఇది ఒకటి.

Also Read : రోజూ రెడ్ వైన్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

​ఫిల్టర్ కాఫీ :

Best filter coffee in Delhi | Times of India Travel

కేరళలో మిస్ కాకుండా టేస్ట్ చేయాల్సిన రుచుల్లో ఫిల్టర్ కాఫీ ఒకటి. ఈ కాఫీ రుచి మీలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. ప్రతి రెస్టారెంట్ లో ఇది తప్పకుండా లభిస్తుంది. ఎంతో చవకైన ఈ కాఫీ స్థానికులకు ఒక ఫేవరెట్ ఆప్షన్. సాధారణ ప్రదేశాల్లో ఒక కప్పు రూ.20ల లోపే మీకు లభిస్తుంది. పెద్ద రెస్టారెంట్ కు వెళితే ధరలో కాస్త మార్పు ఉండవచ్చు.

​తలస్సేరి చికెన్ బిర్యాని :

Thalassery Chicken Biryani - Kali Mirch - by Smita

బిర్యానీల్లో దేశ వ్యాప్తంగా హైదరాబాదీ బిర్యానీకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు దీన్ని తరచుగా టేస్ట్ చేస్తూనే ఉంటారు. అలాంటివారు కేరళలో ఒక కొత్త రుచిని అందించే బిర్యానీను చూడవచ్చు. అదే తలస్సేరి చికెన్ బిర్యాని. కేరళలో ప్రసిద్ధి చెందిన తాజా సుగంధ ద్రవ్యాలను జోడించి చేసే ఈ బిర్యానీ మీరు ఊహించని అద్భుతమైన రుచిని అందిస్తుంది. మీరు మంచి భోజన ప్రియులైతే ఇది మీ ఆకలిని పూర్తిగా సంతృప్తిపరుస్తుంది.

Also Read : రాయలసీమలోని అత్యంత ఎత్తైన వేసవి విడిది కేంద్రం హార్సిలీ హిల్స్..