Kadai paneer recipe in telugu

ఎంతో రుచిగా ఉండే కడై పనీర్..

Recipes

కావలసిన పదార్ధాలు :

పనీర్ – 200 గ్రాములు
క్యాప్సికమ్ ముక్కలు – 1/4 కప్పు
ఉల్లి తరుగు – పావు కప్పు
ఉల్లిముక్కలు – 1/2 కప్పు
టొమాటో తరుగు – అర కప్పు
పసుపు – చిటికెడు
కారం – 2 టీ స్పూన్స్
కొత్తిమీర – 1 కట్ట
పచ్చిమిర్చి – 5
మిరియాలపొడి – 1/2 టీ స్పూను
గరంమసాలా – 1/2 టీ స్పూను
ఉప్పు – తగినంత
నల్ల ఉప్పు – చిటికెడు
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూను
షాజీరా – 1/4 టీ స్పూను
పల్లీలు – 1/4 కప్పు
జీడిపప్పు – 5
కర్బూజా గింజలు – 1/4 కప్పు
బాదంపప్పు – 5
నూనె – 5 టేబుల్ స్పూన్స్

Also Read : ఈ సరస్సులో అప్సరసలు రోజూ స్నానం చేస్తారట..

Kadai Paneer Recipe - 2 Ways (Restaurant Style and Kadai Paneer Gravy)

తయారుచేయు విధానం :

ముందుగా పాన్ లో నూనె వేసి వేడయ్యాక షాజీరా, ఎండుమిర్చి, ఉల్లి తరుగు వేసి దోరగా వేగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు, మిగిలిన పదార్ధాలను కూడా వేసి మరి కొద్దిసేపు వేయించి నూనె పైకి తేలుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి. బాగా వేగిన తర్వాత పనీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి కలిపి 5 నిముషాలు ఉడికించాలి. తర్వాత కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కడై పనీర్ రెడీ అయినట్లే.

Also Read : కొబ్బరి నూనె, కర్పూరం కలిపి ఇలా వాడితే..