how to increase your face beauty with green gram

పెసలతో సౌందర్యం పెంచుకోవడం ఎలానో తెలుసా ?

Beauty

పెసలు మన ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. పెస‌ల‌ను కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని గుగిళ్లుగా చేసుకుని తింటుంటారు. కొంద‌రు వాటిని నాన‌బెట్టి, మొల‌కెత్తించి తింటారు. ఎలా తిన్నా వాటి వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వాటితో ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అంతే కాదు ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌చ్చు. పెస‌ల వ‌ల్ల ముఖానికి సంబంధించి ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో కొన్ని పెస‌ల‌ను వేసి నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే వాటిని మిక్సీ ప‌ట్టి పేస్ట్‌లా చేసుకుని అందులో 1/2 టీస్పూన్ నెయ్యి వేసి బాగా క‌లిపి దాన్ని ముఖంపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే మొటిమ‌ల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Also Read : పాతకాలపు సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్.. మీలో ఎంత మందికి తెలుసు..

Whole Green Moong Dal, Organic, Pan India, Rs 66 /kilogram Quick ...

రాత్రిపూట కొన్ని ప‌చ్చిపాల‌ను తీసుకుని వాటిలో కొన్ని పెస‌ల‌ను వేసి నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ మిశ్ర‌మాన్ని గ్రైండ్ చేసి దాన్ని ఫేస్‌ప్యాక్‌గా మార్చుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాలు ఆగాక నీటితో క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది. డ్రై స్కిన్ ఉన్న‌వారికి ఈ ప్యాక్ ఎంత‌గానో మేలు చేస్తుంది.

ఒక గ్లాసు నీటిలో గుప్పెడు పెస‌ల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే వాటిని పేస్ట్‌లా చేసుకుని అందులో పెరుగు లేదా అలోవెరా జెల్ వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ముఖంపై అప్లై చేసి 10 నిమిషాలు ఆగాక చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎండ‌లో కందిన చ‌ర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది. దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది.

Also Read : మధుమేహానికి చెక్ పెట్టే మధుపత్రి..