horsley hills in chittoor tourism

రాయలసీమలోని అత్యంత ఎత్తైన వేసవి విడిది కేంద్రం హార్సిలీ హిల్స్..

Travel

ఏనుగుమల్లమ్మ కొండలు ఎక్కడున్నాయో చాలా మందికి తెలియదు. కానీ హార్సిలీ హిల్స్ అంటే మాత్రం తెలియనివారుండరు. దక్షిణ భారతాన ఉన్న అతి కొద్ది వేసవి విడిది కేంద్రాల్లో ఇదీ ఒకటి. అలా పలకరించి పోతుండే పిల్లగాలులు, కనుచూపుమేర పరచుకున్న పచ్చని ప్రకృతి, స్వచ్చమైన గాలి, కొండల మలుపుల్లో అలా కనిపించి ఇలా మాయమయ్యే వన్యప్రాణులు ఇవీ హార్సిలీ హిల్స్ అంతటా కనిపించే దృశ్యాలు. ఈ పర్యాటక ప్రదేశం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది. తూర్పు కనుమల పాదాల్లో నెలకొని ఉన్న హార్సిలీ హిల్స్ సముద్రమట్టానికి సుమారు 1265 అడుగుల ఎత్తులో ఉంటుంది.

Also Read : రోజూ రెడ్ వైన్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

Ropeways mooted to lure travellers to Horsely Hills - The Hindu

తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ఎత్తైన వేసవి విడిది కేంద్రం ఇదే. ఒత్తిడితో కూడిన జీవన శైలికి అలవాటుపడిన నగర వాసులకు ఊహించనంత ఆహ్లాదాన్నిఅందించే వేసవి విడిది ఇది. వేసవి సెలవులలో విహార యాత్ర అనగానే చాలామంది ఊటీ, కొడైకెనాల్ అంటారుగానీ ఈ ‘ఆంధ్రా ఊటీ’ గురించి మాత్రం మరచిపోతారు. ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలు, వన్యప్రాణి ప్రేమికులను అబ్బురపరచే దృశ్యాలతో యువతను ఈ ఆంధ్రా ఊటీ విశేషంగా ఆకర్షిస్తోంది. వేసవిలో 30 డిగ్రీలు, శీతాకాలంలో 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఈ ప్రదేశం కేవలం వేసవి విడిది గానే గాక ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా పేరొందింది.

Also Read : భారతదేశంలోని ఈ శివాలయాలను తప్పక సందర్శించాలి..

Horsley Hills|Home

ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు ఏనుగుమల్లమ్మకొండ అని పిలిచేవారు. మూడు దశాబ్దాల క్రితం మల్లమ్మ అనే దైవాంశ గల బాలికను ఏనుగులే పెంచి పెద్ద చేశాయనీ, ఈ ప్రాంతమంతా తిరుగుతూ అక్కడివారిని పలు ఇక్కట్ల నుంచి ఆమె కాపాదేదనీ చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరాన ఆమె ఆలయం కూడా ఉంది. హార్సిలీ హిల్స్ మదనపల్లెకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేరుకు రాయలసీమలో ఉన్నా ఎండ, ఉక్కపోతలు మచ్చుకైనా ఇక్కడ కనిపించవు. మదనపల్లె నుంచి హార్సిలీ హిల్స్ ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంది. అక్కడకు వెళ్లాలనుకునే వారికి బోలెడన్ని ప్రైవేటు వాహనాలు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి.

Also Read : గర్భిణీలు డార్క్ చాక్లెట్ తింటే కడుపులో బిడ్డ బాగా పెరుగుతుందట..