health benefits of sabja seeds

స‌బ్జా గింజ‌లను ఏ సమస్యకు ఎలా వాడాలో తెలుసా ?

Health

స‌బ్జా గింజ‌లు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదంటే ఫ్రూట్ స‌లాడ్స్, ప‌ళ్ల ర‌సాలు, మ‌జ్జిగ వంటి వాటితో క‌లిపి తిన‌వ‌చ్చు. వీటిని ఎలా తీసుకున్న మన ఆరోగ్యానికి చాలా మంచిది. స‌బ్జా గింజ‌ల ద్వారా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ఒక్కో అనారోగ్య సమస్యకు ఒక్కోలాగా తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

స‌బ్జా గింజ‌ల‌ను నీటిలో క‌లిపి తింటే త‌ల‌నొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. మైగ్రేన్‌తో బాధ ప‌డుతున్న వారు కూడా ఇలా చేయ‌వ‌చ్చు. ఇలా చేయడం వల్ల స‌మ‌స్య నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది

అధిక బ‌రువు సమ‌స్య‌తో బాధ ప‌డేవారికి స‌బ్జా గింజలు ఒక చ‌క్క‌ని ఔష‌ధం. ఎందుకంటే వీటిని కొద్ది మోతాదులో తిన్నా త్వ‌ర‌గా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. అందువల్ల ఎక్కువ స‌మ‌యం ఆక‌లి వేయ‌దు. ఫలితంగా బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. కాబట్టి వీటిని నిమ్మరసంతో కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గించుకోవచ్చు.

గోరు వెచ్చ‌ని నీటితో కొద్దిగా తేనె, అల్లం ర‌సం క‌లిపి దాంతో పాటు కొన్ని స‌బ్జాగింజ‌ల‌ను కూడా అందులో వేసి ఆ మిశ్ర‌మం తాగడం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి.

Also Read : అదిరిపోయే క్యారట్ బాదుషా..

Advantages of basil seeds and interesting basil seed recipes ...

స‌బ్జా గింజ‌ల‌ను నీటిలో వేసుకుని తింటే జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉండ‌డంతో మ‌ల‌బ‌ద్ద‌కం బాధించ‌దు. గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

కొద్దిగా స‌బ్జా గింజ‌ల‌ను తీసుకుని పొడి చేసి దాన్ని గాయాల‌పై వేసి క‌ట్టు క‌డితే అవి త్వ‌ర‌గా మానుతాయి. అంతేకాదు ఇన్‌ఫెక్ష‌న్ల‌ను కూడా ద‌రి చేర‌నివ్వ‌దు.

రక్తాన్ని శుధ్ది చేసే గుణాలు స‌బ్జా గింజ‌ల్లో ఉన్నాయి. ర‌క్త స‌ర‌ఫరా కూడా మెరుగు ప‌డుతుంది. బీపీ కూడా అదుపులోకి వ‌స్తుంది. కీళ్ల నొప్పుల స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న వారు స‌బ్జా గింజ‌ల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది. నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. డిప్రెష‌న్ వెంట‌నే దూర‌మ‌వుతుంది.

ఉద‌యాన్నే స‌బ్జా గింజ‌ల‌ను నీటిలో వేసుకుని తింటే త‌ద్వారా ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చిన్నారుల‌కు, టీనేజ్ వారికి ఇలా తినిపిస్తే వారు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు. నీర‌సం ద‌రి చేర‌దు. శారీర‌క శ్ర‌మ చేసే వారు, క్రీడాకారులు ఇలా స‌బ్జా గింజ‌ల‌ను తింటే దాంతో ఇంకా ఎక్కువ సేపు ప‌నిచేయ‌గ‌లుగుతారు.

Also Read : కొబ్బరి పాలతో చర్మ సౌందర్యం..