health benefits of coconut milk

కొబ్బరి పాలతో చర్మ సౌందర్యం..

Beauty

సౌందర్యం పెంచుకోవడానికి ప్రతీ మహిళ చాలా తాపత్రయ పడుతుంది. అందుకోసం ఎన్నో చిట్కాలను ఉపగిస్తారు. మార్కెట్లో దొరికే రసాయనిక క్రీమ్స్‌ వాడడం వల్ల ఉన్న అందాన్ని కాస్తా పోగొట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో దొరికే కొబ్బరిని ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read : సజ్జలు తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు..

ఒక కప్పు కొబ్బరి పాలల్లో ఒక స్పూన్‌ బాదం పొడి, ఒక స్పూన్‌ తులసి పొడి, రెండు చుక్కల తేనె వేసి కొద్దిగా నీరు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా తయారవుతుంది.

గోరువెచ్చని నీటిలో కొద్దిగా రోజ్‌వాటర్‌, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని స్నానానికి ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల నిర్జీవమైన చర్మం తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది. కొబ్బరిపాలను నేరుగా చర్మానికి అప్లై చేసుకొని సాఫ్ట్‌గా మర్దనా చేసుకోవచ్చు. ఇలా చేస్తే చర్మానికి తేమ అందుతుంది.

Also Read : తల్లి అయిన ప్రతీ మహిళా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..

10 Coconut Milk Benefits For Hair, Skin & Health

కొబ్బరి పాలల్లో రెండు చుక్కల నిమ్మరసం కలిపి 10 నిమిషాల తర్వాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే ముఖంపై పేరుకున్న మురికి తొలిగి తాజాగా మారుతుంది.

గులాబి రేకులు, ఒక స్పూన్‌ తేనె, అరకప్పు కొబ్బరి పాలను ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల శరీరానికి తగిన తేమ అంది చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

Also Read : అదిరిపోయే క్యారట్ బాదుషా..