health benefits of guava for babies

జామపండు ఆరోగ్యానికి చేసే మేలు తెలుసా ?

Health

జామపండును ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎన్నో పోషకాలతో బాటు బోలెడంత పీచు అందించే పండ్లలో జామది ప్రత్యేక స్థానంమనే చెప్పాలి. దీనిని పేదవాడి ఆపిల్ గా కూడా పిలుస్తారు. మిగతా పండ్లతో పోలిస్తే చవకగా లభించే ఈ పండ్లను ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. బాగామాగిన జామపండులో తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జామపండును నిర్లక్ష్యం చేయకుండా తరచూ తీసుకుంటే ఎంతో మేలుకలుగుతుంది. జామపండులోనే కాకుండా జామ ఆకు, జామ బెరడులో కూడా పలు రకముల ఔషద గుణాలు ఉన్నాయి. గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

Also Read : ఒక్క గ్లాసు వేడి నీటి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..!

guava health benefits during pregnancy

అంతేకాదు జామపండు వల్ల మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు. జామ పండు తింటే గ్యాస్ట్రిక్, అసిడిటీ వంటి జీర్ణకోశ సమస్యలు, జలుబు దూరమవుతాయి. జామ కాయ ఒంట్లోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి డయాబెటీస్ వ్యాధి ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా జామ కాయను తినేయవచ్చు. జామను ఎక్కువగా తినేవారిలో టైప్-2 డయాబెటిస్ దూరం అవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.

జామ పండు అనేక రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. ఇందులోని పీచు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులో కాల్షియం, ఐరన్‌లు కూడా పుష్కలంగా ఉంటాయి. సోడియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు మూత్రపిండాల్లో వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి. దంత పరిరక్షణకూ జామ దివ్యౌషధం. జామలోని విటమిన్ సి వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం ఆగుతుంది. రోజూ 2,3 లేత జామ ఆకులు నమిలితే నోటిదుర్వాసన తగ్గటమే గాక దంతాలు శుభ్రపడతాయి.

Also Read : లైంగిక సమస్యలను దూరంచేసే ఆశ్వగంధ..