Friday, October 30, 2020
ginger pickle recipe in telugu

అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసా ?

Recipes

కరోనా సమయంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. పండ్లు, కూరగాయల్లోనే కాదు.. పప్పు దినుసులతోనూ, వాటితో చేసే పచ్చళ్లతో కూడా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అందుకే ఇప్పుడు అల్లంతో పచ్చడి తయారు చేసుకుందాం. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

Also Read : వెజ్ పులావ్ ను ఒకసారి ఇలా ట్రై చేయండి..

కావలసిన పదార్ధాలు :

అల్లం – 1/4 కేజీ
ఆవాలు – ఒక టీస్పూన్‌
మెంతులు – 1/2 టీస్పూన్‌
మినప్పప్పు – ఒక టీస్పూన్‌
బెల్లం – కొద్దిగా
నూనె – 2 టేబుల్‌స్పూన్లు
చింతపండు – నిమ్మకాయంత సైజు
ఎండుమిర్చి – 8
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
పసుపు – చిటికెడు
ఇంగువ – చిటికెడు

ginger pickle recipe in telugu

తయారుచేయు విధానం :

ముందుగా స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేగించాలి. అల్లం శుభ్రంగా కడిగి పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చసుకోవాలి. తర్వాత చింతపండును నీళ్లలో నానబెట్టాలి. ఇప్పుడు పోపు, అల్లం ముక్కలు, బెల్లం, పసుపు, ఉప్పు, నానబెట్టిన చింతపండు అన్నీ కలిపి గ్రైండ్‌ చేసుకుంటే అల్లం చట్నీ రెడీ అయినట్లే. అల్లం జీర్ణసమస్యలను దూరం చేస్తుంది. ఇంకా క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం మైక్రోగ్రాముల్లో లభిస్తాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. జలుబు, ఫ్లూ లక్షణాలను తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తిని అందిస్తుంది.

Also Read : తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూడండి