foods to eat when you are pregnant

ప్రెగ్నన్సీ మహిళలు ఈ ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం పదిలం..

Pregnancy

తల్లి అవ్వడం ప్రతీ మహిళా జీవితంలో ఒక తీపి జ్ఞాపకం. అయితే ప్రెగ్నన్సీ మహిళలు తీసుకునే ఆహారంలో పోషకాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం లోపల ఉండే శిశువు మీద ప్రభావం చూపిస్తోంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే మీరు ఖచ్చితంగా మేము ఇప్పుడు చెప్పబోయే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాల్సిందే. మరి అవేంటో చూద్దామా!

Also Read :

ప్రెగ్నన్సీ మహిళలు తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవాలి.

కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. ఇందులో ఎక్కువ మోతాదులో పొటాషియం, లవణాలు ఉంటాయి.

కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు సిట్రస్ పండ్లు తీసుకోవాలి.

బీట్‌రూట్‌లో ఇనుము, బీటా కెరోటిన్లు క్యారెట్‌ కన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి బీట్ రూట్ మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

పాలు, మాంసం, గుడ్లు, చేపలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం మంచిది.

High Fiber Foods: List of 10 Best Fiber-Rich Foods You Must Try

జున్ను తినడం మంచిదే. ఇందులో అధిక కొవ్వు పదార్ధాలు ఉంటాయి. అజీర్ణ సమస్యలు రాకుండా ఉండేందుకు మిరియాలను కలుపుకుని తినాలి.

నారింజ, అనాస తినడం వల్ల వెంటనే జలుబు వచ్చేయదు. శీతాకాలంలోనో, చల్లగా ఉన్నప్పుడో తింటేనే ఆ సమస్య ఉంటుంది.

ముఖ్యంగా తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఆకుకూరలు, బెల్లం, రాగులు, కర్జూరం, ద్రాక్ష, నువ్వులు, చెఱకు రసం, ఉలవలు వంటివి తీసుకోవాలి.

గర్భిణీలలో రక్తహీనత ఉంటే శిశువు తక్కువ బరువుతో పుడతారు. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

Also Read :