home remedies for beautiful waist

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా ?

Health

భారతీయులు నువ్వులను పలు వంటకాల్లో ఎప్పటి నుండో ఉపయోగిస్తున్నారు. నువ్వుల నుంచి తీసిన నూనెతో అనేక వంటకాలు చేసుకోవచ్చు. అలాగే నువ్వులను పలు సాంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే నువ్వులు శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని పెంపొందించే అన్నిరకాల పోషకాలను కలిగి ఉంటాయి. నువ్వులను అల్పాహారం, భోజనంలోనూ, బెల్లంతో చేసిన లడ్డూల రూపంలో, పెరుగు, సలాడ్లు, స్మూతీల రూపంలో కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా నువ్వులతో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలో నిత్యం ఒక గుప్పెడు నువ్వులను తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ప్రతి రోజూ ఒక గుప్పెడు నువ్వులను తింటే మనకు 3.5 గ్రాముల ఫైబర్ అందుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లు, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
  • నువ్వులను రోజు మీ ఆహారంలో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నువ్వులు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే వీటివల్ల మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లు అందుతాయి.
  • హైబీపీ సమస్యతో బాధపడేవారు నిత్యం నువ్వులను తీసుకుంటే బీపీ తగ్గుతుంది. నువ్వులు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపు చేస్తుంది. అలాగే వీటిలో ఉండే కాల్షియం వల్ల ఎముకలను దృఢంగా మారుతాయి.
  • నువ్వుల నూనెను రాసుకుంటే ఎలాంటి నొప్పులైనా తగ్గిపోతాయన్న సంగతి తెలిసిందే. అయితే నువ్వులను తిన్నా నొప్పులను తగ్గించుకోవచ్చు. నువ్వుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. ఇక వీటిని రోజు తినడం తినడం వల్ల మన శరీరానికి కావల్సిన విటమిన్లు బి1, బి3, బి6లు అందుతాయి.

Related image

  • రక్తహీనత సమస్యతో బాధపడేవారు రోజూ నువ్వులను తినడం వల్ల వాటిలో ఉండే ఐరన్ రక్తాన్ని వృద్ధి చేస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నువ్వులను తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. నువ్వులు తినడం వల్ల ఉబ్బసం వ్యాధి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
  • నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని రోజు ఆహారంలో చేర్చుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే నువ్వుల్లో ఉండే సెలీనియం, కాపర్, జింక్‌లు థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. వారిలో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. దీంతోపాటు హార్మోన్స్ అసమతుల్యతను సరిచేస్తాయి.
  • నువ్వులనూనెలో ఉండే విటమిన్లు చర్మానికి సంబంధించిన అన్నిరకాల సమస్యలను దూరం చేసే గుణాలను పుష్కలంగా కలిగి ఉన్నాయి. నువ్వుల నూనెను చర్మ సంరక్షణలో ఉపయోగించడం ద్వారా ముఖాన్ని తాజాగా, యవ్వనంగా మెరుస్తూ ఉండేలా చేసుకోవచ్చు.
  • చిన్నారుల ఆరోగ్యం, అందం విషయంలో నువ్వుల నూనె కీలకపాత్ర పోషిస్తుంది. స్నానం చేపించే ముందు పసిపిల్లల మాడుకు, శరీరానికి నువ్వులనూనెతో మర్దనా చేస్తే ఆ రోజంతా హాయిగా నిద్రపోతారు. చిన్నారుల్లో మెదడు ఎదుగుదలకు ఈ నూనె బాగా తోడ్పడుతుంది. వెన్నెముక, కండరాలు బలపడేందుకు ముందు నువ్వులనూనెతో ఒళ్లంతా రుద్దితే, పిల్లల చర్మం ప్రకాశవంతంగా అవుతుంది. ఇది పిల్లలకు ఒక మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.