do children get teeth while sleeping

మీ పిల్లలకు నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉందా..

Kids-Health

చాలామందికి నిద్ర పోతున్నప్పుడు పగలు చేసిన పనులన్నీ పడుకున్నాక గుర్తు రావడంతో కలవరించడం, పళ్ళు కొరకడం, అరవడం లాంటివి చేస్తారు. ఈ పనులు పక్కన ఉన్నవారిని ఇబ్బంది పెట్టి, చికాకు కలిగిస్తాయి. కానీ కొంతమంది పిల్లలు నిద్రలో పళ్ళు కొరుకుతుంటారు. తమ పిల్లలు ఎందుకు ఇలా నిద్రలో పళ్ళు కొరుకుతున్నారో తెలియక తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. సాధారణంగా పిల్లల్లో పరీక్షల గురించి ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నిద్రలో పళ్ళు కొరుకుతారు.

Also Read : వేడి వేడి మామిడికాయ అన్నం..

అంతేకాదు పళ్ళ వరుస ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు నొప్పికి స్పందించడానికి పిల్లలు పళ్ళు కొరుకుతారు. కొన్ని రకాల వ్యాధులకు వాడే ఔషధాల వల్ల కూడా ఇలా జరుగుతుంది. నిద్రలో మాట్లాడే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల పళ్ళ పై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. ఇంకా విపరీతమైన తలనొప్పి వస్తుంది. అయితే ఈ సమస్యని దూరం చేయడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

Also Read : కలబంద ఆరోగ్య ప్రయోజనాలు..

7 Tips on Getting Your Toddler to Sleep Better | CafeMom

పిల్లలకి వెచ్చటి స్నానం, చక్కని సంగీతం వినిపించడం, పుస్తకాలు చదవడం వంటి స్లీపింగ్ చిట్కాలను అలవాటు చేయండి. అధిక కెఫిన్ ఎక్కువగా ఉండే చాక్లెట్స్ కి దూరంగా ఉంచాలి. ఇంకా చూయింగ్ గమ్ ఎక్కువగా నమలడం వల్ల పిల్లల దవడలు అధికంగా బిగించి ఉండటం వల్ల కూడా నిద్రలో పళ్ళు కొరకవచ్చు. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించడానికి వారితో మాట్లాడటం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలి. దీని వల్ల పళ్ళు కొరికే సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

Also Read : పాతకాలపు సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్.. మీలో ఎంత మందికి తెలుసు..