do any professionals know what diseases are causing them

ఏ వృత్తి వారికి ఏ వ్యాధులు వస్తాయో తెలుసా ?

Lifestyle

వృత్తి కారణంగా తలెత్తే అనారోగ్యాల నివారణ, చికిత్స విధానాన్నే వైద్య పరిభాషలో “ఆక్యుపేషనల్ మెడిసిన్” అంటారు. మనం ఎదుర్కొనే చాలా అనారోగ్యాలకు వృత్తిపరమైన అంశాలే ప్రధాన కారణాలుగా ఉంటాయి. అందుకే ఏదైనా అనారోగ్యంతో డాక్టర్ ని కలిసినప్పుడు ఆరోగ్య వివరాలతో బాటు వృత్తి వివరాల గురించీ ఆరా తీస్తుంటారు. పలు వృత్తులు వారు ఎదుర్కొనే సమస్యల పట్ల కనీస అవగాహన ఉన్నప్పుడు మన వృత్తిని బట్టి తగు ముందు జాగ్రత్తలు తీసుకొని సంబంధిత అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు కొన్ని వృత్తుల వారికొచ్చే వ్యాధులు, వీరు పాటించాల్సిన జాగ్రత్తల వివరాలను తెలుసుకుందాం..

Also Read : గర్భిణీలు డార్క్ చాక్లెట్ తింటే కడుపులో బిడ్డ బాగా పెరుగుతుందట..

ఐటీ, బ్యాంకింగ్, సర్వీస్ రంగాల ఉద్యోగులు రోజంతా కంప్యూటర్లపై పని చేయటంతో మెడ, నడుము నొప్పులతో బాటు దీర్ఘకాలంలో మధుమేహం, ఊబకాయం వంటి రుగ్మతల బారినపడుతుంటారు. కూర్చొనే భంగిమ, అందుకు తగిన కుర్చీలు, టేబుళ్లు లేకపోవటం, తీవ్రమైన ఒత్తిడి కూడా ఈ సమస్యలకు కారణాలే. షిఫ్టు మార్పుల కారణంగా నిద్రలేమి, జీర్ణ సమస్యలు, మానసిక కుంగుబాటు వంటి ఇబ్బందులూ వీరిని వేధిస్తున్నాయి.

ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు, పోలీసులు, మార్కెటింగ్ ఉద్యోగులు వాతావరణ మార్పులు, కాలుష్యం, వాహనాల ధ్వనుల ప్రభావానికి ఏడాదిపొడవునా లోనవుతుంటారు. దీంతో గాలిలోని సీసం, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ ఊపిరితిత్తుల్లోకి శ్వాసకోశ సమస్యల బారినపడుతుంటారు. ఇక.. క్వారీ కార్మికులు, పలకల పరిశ్రమ, బలపాల తయారీ కార్మికులు ఇసుక, రాళ్లలో ఉండే సిలికాన్‌ డైఆక్సైడ్‌ వంటివి దీర్ఘకాలం పీల్చటం వల్ల సిలికోసిస్‌ వంటి ఊపిరితిత్తుల సమస్యల బారినపడుతుంటారు.

Also Read : ధనియాలు ఉపయోగాలు తెలిస్తే..

bpositivetelugu

వ్యవసాయ కూలీలు పంటలకు వాడిన క్రిమిసంహారకాల అవశేషాల ప్రభావానికి లోనవడం, తడివాతావరణంలో పొగాకు తోటల్లో పనిచేసే కార్మికులు నికోటిన్‌ ప్రభావానికి లోనైనప్పుడు వికారం, తలనొప్పి, తీవ్రమైన బలహీనత వంటి సమస్యలు మొదలవుతాయి.

పెట్రోలు బంకు ఉద్యోగులు రోజంతా బెంజీన్‌, టొలీన్‌ వంటి రసాయనాల ప్రభావానికి గురవటం వల్ల కళ్ళ మంట, కంటి నుంచి నీరు కారటం, దగ్గు, తలనొప్పి, డస్సిపోవటం, గొంతులో నస వంటి ఇబ్బందుల పాలవుతారు. వీరికి దీర్ఘకాలంలో చర్మం పాలిపోవటం, రక్తహీనత , మగత, కండరాల బలహీనతలూ దురు కావచ్చు. అందుకే వీరు ఈ లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి.

రోగుల చికిత్సకు వాడే సూదులు, కత్తెరల మూలంగా డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది గాయాలపాలై హెపటైటిస్‌-బి, సి, హెచ్‌ఐవీ వంటి వాటి బారినపడే ముప్పు ఎక్కువ. అలాగే ఆపరేషన్‌ థియేటర్‌లో మత్తుమందు ప్రభావం, రోజంతా తిరగటం, నిలబడటం వల్ల నడుం నొప్పి కూడా రావచ్చు. దంతవైద్యులకు అమాల్గమ్‌ల వల్ల శరీరంలోకి పాదరసం చేరటం, ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ.

Also Read : ఈ ఆహార పదార్థాలను కలిపి తింటే చాలా మంచిదట..