can breastfeeding reduce sex drive

బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల సెక్స్‌పై ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా..

Pregnancy

మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గరి నుండి డెలివరీ అయిన తర్వాత కూడా చాలా మందిలో చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా డెలివరీ తర్వాత సెక్స్ విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. చాలామందిలో సెక్స్ పై ఆసక్తి తగ్గుతుంది. డెలివరీ తర్వాత మీ శరీరం ఎన్నో ఛేంజెస్ కు గురవుతుంది. డెలివరీ ఐన తరువాత లైఫ్ పూర్తిగా మారిపోతుంది. బేబీ మధ్యరాత్రిలో ఆకలికి ఏడుస్తుంది. కాబట్టి లేట్ నైట్ కూడా ఫీడింగ్స్ చేయాల్సి వస్తుంది. అలాగే ఉదయాన్నే డైపర్స్ ను మార్చాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే సెక్స్ అనేది మీకు లాస్ట్ ప్రయారిటీగా మారుతుంది.

Also Read : లెమన్ గ్రాస్ వాడడం వల్ల కలిగే ఉపయోగాలు..

బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల సెక్స్ పై ఆసక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఓ స్టడీ ప్రకారం బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న మహిళలు బ్రెస్ట్ ఫీడింగ్ చేయని మహిళలతో పోల్చితే సెక్స్ లైఫ్ ను తిరిగి ప్రారంభించడాన్ని డిలే చేస్తారట. డెలివరీ తరువాత ఈస్ట్రోజెన్ లెవెల్ పడిపోతుంది. అలాగే ప్రొలాక్టిన్ మరియు ఆక్సీటాసిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ రెండు హార్మోన్స్ శరీరంపై వేరు వేరు ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇవన్నీ సెక్స్ పై ఆసక్తిని తగ్గిస్తాయి. ఈ హార్మోన్స్ పెరగడం వల్ల మీకు బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా గ్రేట్ ప్లెజర్ లభిస్తుంది. ఇవి మీ ఎమోషనల్ అలాగే ఫిజికల్ ఇంటిమసీ నీడ్స్ ను తీరుస్తాయి. కాబట్టి సెక్స్ కోరిక తగ్గుతుంది.

can breastfeeding reduce sex drive

ఇందుకు వ్యతిరేకంగా కూడా కొన్నిసార్లు జరగొచ్చు. ఈ హార్మోన్స్ స్థాయిలు పెరగడం వల్ల మీలో సెక్స్ పై ఆసక్తి కూడా పెరగొచ్చు. బ్రెస్ట్స్ అనేవి లైంగికాసక్తిని కలిగించే జోన్ గా మారుతుంది. మీలో సెన్సేషన్స్ పెరుగుతాయి. ఇవన్నీ ఈ హార్మోన్స్ పెరుగుదల వల్ల జరగొచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ మీ సెక్స్ డ్రైవ్ పై ప్రభావం చూపుతోందని మీకనిపిస్తే ఇది పూర్తిగా నార్మల్ అన్న విషయాన్ని గుర్తించండి. హార్మోన్లలో మార్పులతో పాటు లైఫ్ స్టైల్ లో మార్పుల వల్ల లైంగికాసక్తి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఐతే రాను రాను మీ సెక్స్ డ్రైవ్ తిరిగి మాములు స్థితికి వచ్చేస్తుంది. బేబీ రాకముందు మీలో సెక్స్ డ్రైవ్ ఎలా ఉండేదో మళ్ళీ అదే విధమైన సెక్స్ డ్రైవ్ కలిగేందుకు కొంతకాలం పడుతుంది.

Also Read : మీరు ఎక్కువుగా జంక్ ఫుడ్ తింటారా.. అయితే మీకు పిల్లలు పుట్టడం కష్టమే..