breastfeeding advice during the covid-19

బాలింతకు కరోనా వస్తే బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేయ్యాలా ?

Pregnancy

కరోనా వైరస్.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వృద్ధులకూ, బలహీనపడిన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వారికీ, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికీ, గర్భిణీలకూ కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గర్భిణీలకూ, బాలింతలకూ మామూలు వాళ్లకంటే ఎక్కువగా ఇన్ ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందన్న సాక్ష్యాలేమీ లేకపోయినా, వాళ్ళ శరీరంలో జరిగే మార్పుల వల్ల వాళ్ళు కొన్ని తీవ్రమైన ఇన్‌ఫెక్షన్స్ బారినపడే అవకాశముంది. అందువల్ల వారు నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తపడాల్సిందే..

pregnancy parenting tips News : తల్లికి కరోనా ...

ఎందుకంటే ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆమె రోగనిరోధకవ్యవస్థ బలహీనపడుతుంది. దానితో ఆమెకి ఇన్ ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్ ఫెక్షన్ల వల్ల తల్లికి మాత్రమే కాదు కడుపులో ఉన్న బిడ్డకీ, డెలివరీ తర్వాత బిడ్డకీ కూడా ప్రమాదమే. మీరు బాలింతగా ఉన్నప్పుడు కరోనా సోకితే పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వొచ్చా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కొవిడ్-19 సోకిన బాలింత తన బిడ్డను హత్తుకోడానికి, తన బిడ్డతో పాటూ ఒకే గదిలో ఉండడానికి, తన బిడ్డకు తల్లిపాలు పట్టడానికి కావాల్సిన సహాయం అందించాలి.

Also Read : మెడ మీద నలుపును మాయం చేసే చిట్కాలు..

త‌ల్లి పాలతో ఎన్ని లాభాలో...

తన తల్లి ద్వారా అప్పటికే కరోనా వైరస్ లక్షణాలకు బహిర్గతమైన శిశువుకు తల్లిపాలు చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే తల్లిపాలు బిడ్డ రోగనిరోధకవ్యవస్థను బలోపేతం చేసి ఎన్నో రకాల వ్యాధుల నుంచి బిడ్డని రక్షిస్తాయి. కానీ పాలు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. బాలింత బిడ్డను తాకే ముందూ తరువాతా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చుట్టుపక్కల ప్రదేశాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. బిడ్డను దగ్గరగా హత్తుకున్నప్పుడూ, పాలు పడుతున్నప్పుడూ మాస్క్ వేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.

Also Read : మట్టి కుండలో నీళ్లు తాగుతున్నారా ?