benefits of mixture of coconut oil and camphor

కొబ్బరి నూనె, కర్పూరం కలిపి ఇలా వాడితే..

Lifestyle

కొబ్బరినూనె వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికీ, చర్మానికీ చాలా మేలు చేస్తుంది. ఇంక కర్పూరం మనం చాలా రకాలుగా వాడుతాము. ఈ రెండింటినీ కలిపి వాడితే చాలా రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కొబ్బరి నూనెలో కర్పూరం కలపడం వల్ల చర్మం, జుట్టుకి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. కొబ్బరి నూనెలో కర్పూరం వేసి కాచి చల్లార్చి ఈ నూనెను అనేక విధాలుగా వాడవచ్చు.

Also Read : తేజస్వి మదివాడ అదిరిపోయే ఫోటోస్

How to make camphor oil for hair growth – Mayybelleza

చర్మంపై అలెర్జీ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి ఆ ప్రదేశంలో రాసుకోండి. ఇలా రెండు మూడు రోజులు చేశారంటే ఆ సమస్య తొలగిపోయినట్లే. ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉంటే రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెలో కర్పూరం పొడి వేసి మచ్చలపై మసాజ్ చేయండి. దీనివల్ల మచ్చలు నెమ్మదిగా క్లియర్ అవుతాయి.

Also Read : బీట్‌రూట్‌ చపాతి..

Camphor (कर्पूरम्) - The Chalk of Barus (Moon Powder)

చర్మంపై మొటిమలు మీ ముఖాన్ని పాడు చేస్తాయి. కొబ్బరి నూనె, కర్పూరం కలిపిన తైలాన్ని మొటిమలపై రాస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ నూనె చుండ్రు సమస్యను పరిష్కరించడానికి గొప్ప ఉపశమనంగా ఉంటుంది. అంతేకాదు గోరు మీద ఫంగస్ ఉంటే గోరువెచ్చని నూనె పూస్తే క్రమంగా తగ్గుతుంది.

Also Read : తలనొప్పి తగ్గాలంటే ధనియాలతో ఇలా చేస్తే సరి…