beetroot chapati recipe in telugu

బీట్‌రూట్‌ చపాతి..

Recipes

కావలసిన పదార్ధాలు :

బీట్‌రూట్‌ గుజ్జు – 1 కప్పు
గోధుమ పిండి – 1 కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌
వాము పొడి – అర టీ స్పూన్‌,
ఉప్పు – తగినంత,
నూనె – 1 టీ స్పూన్‌,
నీళ్లు – సరిపడ
నూనె – తగినంత
ఉల్లిపాయ – 1
కొత్తిమీర – కొద్దిగా

Also Read : విట‌మిన్ డి లోపిస్తే కరోనా తొందరగా ఎటాక్ చేస్తుందని మీకు తెలుసా..!

Beet and Avocado Chapati Recipe by Archana's Kitchen

తయారుచేయు విధానం :

ముందుగా ఒక పెద్ద బౌల్‌లో గోధుమ పిండి, బీట్‌రూట్‌ గుజ్జు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, వాము పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దీ పరిమాణంలో ముద్దలు తీసుకుని చపాతి కర్రతో చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌ పైన నూనె వేసి రెండు వైపులా దోరగా వేయించుకుని.. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుముతో గార్నిష్‌ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి.

Also Read : రోజ్ వాటర్‌తో అందానికి మెరుగులు..