amazing health benefits of figs

బరువు తగ్గాలనుకునే వారికి అంజీర పండ్లు మంచి ఛాయిస్…

Health

అంజీర పండుతో మేలైన ఆరోగ్యం అందుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్నిపండ్లు తాజాగా తింటేనే వాటిలోని పోషకాలు పూర్తిగా అందుతాయి. మరికొన్ని పండ్లు ఎంత ఎండితే వాటిలోని పోషకాలు అంత రెట్టింపవుతాయి. అలాంటి పండ్లలో అంజీర ఒకటి. రోజులో రెండు పండ్లు తిన్నా అనేక సమస్యలు దూరంగా ఉంటాయని చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో దీన్ని ఔషధ ఫలంగా వాడతారు.

అంజీర పండ్లు గుండెకు కూడా చాలా మేలు చేస్తాయి. అంజీరలో అధికంగా లభించే పీచు మూలంగా అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. అంజీర పండ్లు ఎన్ని తిన్నా కొలెస్ట్రాల్ చేరదు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు మంచి ఛాయిస్. భోజనానికి ముందు కొన్ని అంజీర ముక్కల్ని తినడం వల్ల పొట్ట నిండినట్టుగా అనిపించి భోజనం తక్కువ తింటారు. ఇలా చాలా హెల్తీ పద్ధతిలో బరువు తగ్గొచ్చు.

Also Read : శరీరంలో మెగ్నీషియం లోపిస్తే జరిగే అనర్ధాలు..

amazing health benefits of figs

చిన్నారులు, వృద్దులకు ఎదురయ్యే జీర్ణ సంబంధిత సమస్యలకు అంజీర మంచి ఔషధం. ఈ పండ్లలో అధికంగా ఉండే మెగ్నీషియం, మాంగనీసు, జింకు సంతాన సాఫల్యత పెంచడంలో కీలక పాత్రపోషిస్తాయి. కనుక సంతానం కోరుకునే దంపతులు అంజీరను ఎంత తీసుకుంటే అంత మంచిది.

మహిళల్లో కూడా రక్త హీనత సమస్య అధికంగా ఉంటుంది. అంజీర పండ్లలో ఉండే ఫైబర్ పదార్దాలు క్యాన్సర్‌ను తగ్గిస్తాయని నిపుణులు  చెబుతున్నారు. నిద్రలేమీ సమస్యతో బాధపడేవారు రాత్రి అంజీర పళ్ళు తిని, పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. లైంగిక బలహీనత ఉన్నవారు రాత్రిపూట 2-3 అంజీర పండ్లను పాలలో నానబెట్టి ఉదయం వాటిని తింటే మీ లైంగిక శక్తిని మెరుగుపడుతుంది.

Also Read : ఆరోగ్యానికి ద్రాక్ష చేసే మేలు..